కాసేపట్లో మంత్రివర్గ విస్తరణ

హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గాన్ని సీఎం కేసీఆర్ విస్తరిస్తున్నారు. ఈ ఉదయం  11.30 నిమిషాలకు కొత్త మంత్రులు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తర్వాత.. ఒక్కొక్కరుగా మంత్రులు వేదికపైకి వస్తారు. వారితో.. గవర్నర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

పది మంది ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో పదవులు ఖరారు అయ్యాయి. సీఎం కేసీఆర్ తో పాటు.. ముఖ్యమైన నాయకులు, పదవులు అందుకోబోతున్న నాయకులు.. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నేతలు..  అంతా ఇప్పటికే రాజ్ భవన్ కు చేరుకున్నారు. 

మంత్రులుగా పదవులు దక్కించుకున్నవారికి ఇప్పటికే ముఖ్యమంత్రి ఫోన్ లో సమాచారం ఇచ్చారు. రాజ్ భవన్ లోకి కొత్త మంత్రులు కుటుంబసభ్యులను మాత్రమే అనుమతిస్తున్నారు. టీఆర్ఎస్ కేడర్ , నాయకులకు రాజ్ భవన్ లోపలికి అనుమతిలేదు. రాజ్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 

కేబినెట్ లో కీలకమైన పదవి తీసుకోబోతున్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. గండిపేట్ మండల్ మంచిరేవుల గ్రామంలోని ఆయన ఇంటి దగ్గర కార్యకర్తల హడావుడి ఈ ఉదయం భారీగా పెరిగింది. తమ‌ అభిమాన ఎమ్మెల్యేకు మంత్రి వర్గంలో చోటు దక్కి నందుకు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్న కార్యకర్తలు.

Latest Updates