10 మంది మంత్రులు : ప్రమాణం చేయించిన గవర్నర్

హైదరాబాద్ : రాజ్ భవన్ లో కొత్తమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్ర గవర్నర్ నరసింహన్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి … కొత్త మంత్రులను ఒకరితర్వాత మరొకరిని పిలిచారు. వారితో మంత్రులుగా ఒకరి తర్వాత మరొకరిని గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యాంగంపట్ల విధేయతను చూపుతాననీ… కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులందరూ దైవసాక్షిగా అని చెప్పగా… జగదీశ్ రెడ్డి, ఈటల రాజేందర్ పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నామని చెప్పారు.

మంత్రులుగా ప్రమాణం చేసింది వీళ్లే :

  1. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
  2. తలసాని శ్రీనివాస్ యాదవ్
  3. జగదీశ్ రెడ్డి
  4. ఈటల రాజేందర్
  5. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
  6. కొప్పుల ఈశ్వర్
  7. ఎర్రబెల్లి దయాకర్ రావు
  8. శ్రీనివాస్ గౌడ్
  9. వేముల ప్రశాంత్ రెడ్డి
  10. మల్లారెడ్డి

మంత్రిగా ప్రమాణం :

“… అనే నేను…  శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాననీ.. భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతాననీ..  తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో.. అంత:కరణశుద్ధితో నిర్వహిస్తాననీ…  భయం గానీ.. పక్షపాతం గానీ.. రాగద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి.. ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.

… అనే నేను.. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా .. నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన.. ఏ విషయాన్ని.. నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప.. ప్రత్యక్షంగా గానీ.. పరోక్షంగా గానీ.. ఏ వ్యక్తికీ లేదా వ్యక్తులకు తెలియపరచననీ.. లేదా వెల్లడించననీ.. దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను”

Latest Updates