రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విపత్తు దాపురించింది

కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసి విధానాలను తుంగలో తొక్కిందన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్. ప్రజలను విస్మరించి పాలకులు పాలన సాగిస్తున్నారన్నారు. శుక్రవారం గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపత్, పార్టీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, ఇందిరా శోభన్ మీడియాతో సమావేశమయ్యారు.

సమావేశంలో సంపత్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. రైతులకు రైతు బంధు లేదు, వర్షాలు పడినా ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు, ఉద్యోగులకు పీఆర్సీ లేదు. ఇక ఆర్టీసీ విషయంలో ఎంత చెప్పినా తక్కువే. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోంది. కార్మికులు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరు కష్టాలు పడుతున్నారని” అన్నారు.

ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న మమ్మల్ని.. ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారని సంపత్ అన్నారు. దేశంలో ఇంత దుర్మార్గమైన, రాజ్యాంగ విరుద్ధ, అప్రజాస్వామ్య పాలన మరెక్కడా లేదన్నారు. మీడియాను కూడా అణగతొక్కి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని  సంపత్ అన్నారు.

TS Congress leaders serious over KCR rule in the state

 

 

Latest Updates