కలిసి పనిచేస్తరు.. ప్రాణాలు కాపాడ్తరు

    రోడ్ ​యాక్సిడెంట్స్​తగ్గించేందుకు పోలీసుల ప్లాన్​

    టీఎస్​కాప్​ యాప్​తో హైవే మొబైల్​టీమ్స్,

    108 , హాస్పిటల్స్​ వివరాల అనుసంధానం

నేషనల్ హైవేస్​తో పాటు గ్రేటర్ రోడ్లపై రోడ్డు ప్రమాదాలు నివారించడానికి, బాధితుల ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 82 హైవే మొబైల్స్ టీమ్స్,108 సర్వీసులు, హాస్పిటల్స్ వివరాలను టీఎస్ కాప్ యాప్ కి లింక్​ చేశారు. దీంతో యాక్సిడెంట్​జరిగిన ప్లేస్​కు హైవే మొబైల్ టీమ్స్​నిమిషాల వ్యవధిలోనే చేరుకుంటారు. అంబులెన్స్ వచ్చే లోపు వీరు గాయపడిన వారికి ఫస్ట్ ఎయిడ్ చేయడమే కాకుండా వారిని వీలైనంత తొందరగా దగ్గరలోని దవాఖానకు తరలించేలా చూస్తారు.

ఎప్పటికప్పుడు అప్​డేట్​

108కి రాష్ట్రవ్యాప్తంగా ప్రతీరోజు సుమారు10 వేలకు పైగా రోడ్ యాక్సిడెంట్స్ కాల్స్​వస్తున్నాయి. వీటిలో 1200 ఎమర్జెన్సీ కాల్స్ వస్తుండగా తీవ్రగాయాలైన వారిని 108 సిబ్బంది హాస్పిటల్స్ కి తరలిస్తున్నారు. సీరియస్​ ఇంజ్యూరీ అయిన వారిని గంటలోపే కావాల్సిన ట్రీట్​మెంట్​ అందజేస్తే రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్నే గోల్డెన్ హవర్​అంటారు.  కాబట్టి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్​ వివరాలు తెలిసి ఉండాలి. దీనికోసం నేషనల్ హైవేస్ తో పాటు జిల్లాలు, రూరల్​రోడ్లపై ఉన్న హాస్పిటల్స్​డిటెయిల్స్​ను టీఎస్ కాప్ యాప్​లో అప్ లోడ్ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు స్పాట్ కు చేరుకునే హైవే మొబైల్స్​టీమ్స్​ఫస్ట్​ఎయిడ్​తో పాటు అంబులెన్స్ ఎంత దూరంలో ఉంది? స్పాట్ కి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? వంటి విషయాలను మానిటరింగ్ చేస్తుంటారు. అలాగే యాప్ లో బాధితుడి సమాచారం, ఫస్ట్ ఎయిడ్ చేసిన సమాచారం అప్​లోడ్​ చేస్తారు. గాయపడిన వ్యక్తికి అవసరమైన ట్రీట్ మెంట్ ఏ హాస్పిటల్​లో అందుబాటులో ఉందో చూసుకుని అక్కడికి వీలైనంత తొందరగా తరలించేలా చూస్తారు. ఇప్పటికే పనిచేస్తున్న ‘ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనాలిసిస్ సెల్’ తో పాటు స్థానిక రోడ్ సేఫ్టీ, ఆర్టీఏ అధికారులతో కలిసి కో ఆర్డినేట్​చేసుకుంటారు. దీంతో పాటు  ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్స్ గుర్తిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 871 బ్లాక్ స్పాట్స్ లోని 326 ప్రాంతాల్లో ఇంజినీరింగ్​లోపాలు గుర్తించారు.  వీటిని సరిచేసి యాక్సిడెంట్స్​ జరగకుండా చర్యలు తీసుకోబోతున్నారు.

Latest Updates