డీసెట్‌ దరఖాస్తుల గడువు ఏప్రిల్‌ 4 వరకు

TS DEESET application last date will be April 4

హైదరాబాద్‌‌, వెలుగు: డిప్లొమా ఇన్ ఎలి-మెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ), డిప్లొమా ఇన్ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ ఈ) కోర్సుల లో ప్రవేశానికి నిర్వహించే డీసెట్‌-– 2019 దరఖాస్తుకు ఏప్రిల్‌‌ 4 వరకు చాన్స్​ ఉందని డీసెట్‌ కన్వీనర్‌‌ సత్యనారాయణ రెడ్డి సోమవారం తెలిపారు. ఈనెల 11 నుంచి ఆన్‌ లైన్‌ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఇప్పటివరకు 6,200 అందాయన్నారు. మే 22న ఎంట్రెన్స్​ టెస్ట్​ ఉంటుం దని తెలిపారు. రాష్ట్రంలో 208 డీఈ డీ కాలేజీల్లో 11,550 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయా కోర్సులలో ప్రవేశపరీక్ష ఆధారంగా సీట్లు భర్తీ చేస్తామనిఆయన చెప్పారు.

Latest Updates