ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల

హైద‌రాబాద్ : ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. శనివారం  కుకట్‌పల్లి జేఎన్టీయూలో ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ పాపిరెడ్డి ఫలితాలను విడుద‌ల చేశారు. ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ విభాగంలో 92.57 శాతం ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు తెలిపారు పాపిరెడ్డి. 63,857 మంది అభ్య‌ర్థుల‌కు గానూ 59,113 మంది అభ్య‌ర్థులు ఉత్తీర్ణ‌త సాధించారని తెలిపారు. ఈ ప‌రీక్ష‌కు 80.85 శాతం మంది అభ్య‌ర్థులు హాజ‌ర‌య్యారని చెప్పారు. నవంబర్ నెలలో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ పాపిరెడ్డి.  tseamcet.tsche.ac.in వెబ్‌ సైట్ ‌లో ఫలితాలు, ర్యాంక్ కార్డ్స్ అందుబాటులో ఉంటాయి.

 

Latest Updates