మే 23న ఎడ్ సెట్

హైదరాబాద్, వెలుగు: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్ సెట్–2020 పరీక్ష మే 23న జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్స్​లో ఈ ఎగ్జామ్​ఉంటుంది. జూన్ 11న ఫలితాలను రిలీజ్​చేస్తారు. ఈ నెల 20న ఎడ్​సెట్​ నోటిఫికేషన్​ రిలీజ్​కానుంది. ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 20 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సోమవారం హైదరాబాద్​లో ఉన్నత విద్యామండలి చైర్మన్​పాపిరెడ్డి అధ్యక్షతన ఎడ్‌‌‌‌సెట్​కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎడ్ సెట్​షెడ్యూల్​ను ఆయన విడుదల చేశారు. తొలిసారిగా ఓరియంటల్​ స్టూడెంట్స్ ​కూడా ఎడ్ సెట్ రాసేందుకు అవకాశం కల్పించగా, దివ్యాంగ స్టూడెంట్లకు ఫీజు రాయితీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్​ స్టూడెంట్స్​కు రూ.450 ఫీజు, ఇతర స్టూడెంట్లకు రూ.650 ఫీజు నిర్ణయించారు. రూ.500 ఫైన్​తో ఏప్రిల్ 25 వరకూ, రూ.వెయ్యి ఫైన్​తో ఏప్రిల్​30 వరకూ, రూ.2 వేల ఫైన్​తో మే 4 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పరీక్షను 14 రీజియన్​సెంటర్ల పరిధిలో నిర్వహిస్తున్నట్టు ఎడ్​సెట్​కన్వీనర్ మృణాళిని తెలిపారు. ఏపీలోని విజయవాడ, కర్నూల్​లో సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్​ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, కౌన్సిల్​ సెక్రెటరీ శ్రీనివాస్​రావు, ఓయూ రిజిస్ట్రార్ గోపాల్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest Updates