హోం క్వారంటైన్ గడువు పెంచిన తెలంగాణ ప్ర‌భుత్వం

తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే వెయ్యికి చేరువలో కేసులు నమోదయ్యాయి. కరోనా ను అరికట్టడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ను సమర్ధవంతంగా అమలు చేస్తున్నా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులు ఇదివరకు 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని రూల్ ఉండగా ఇప్పుడు దానిని 28 రోజులకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పాజిటివ్ కేస్ లు ఉన్న వారిని ( ప్రైమ‌రీ కాంటాక్ట్‌ల‌ను) మాత్రమే ప్రభుత్వం గుర్తించిన క్వారంటైన్ సెంటర్ కు తరలించాలని తెలిపింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌ధాన‌‌ కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లకు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Latest Updates