కోవిడ్-19: సూర్యాపేట మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్

సూర్యాపేటలో అత్యధిక స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో న‌గ‌ర‌ మున్సిపాలిటీకి ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్‌ను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు సూర్యాపేటకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) నియామకం జరిగింది. ప్రస్తుతం మున్సిపల్ పరిపాలన శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి. వేణుగోపాల్ రెడ్డిని ఓఎస్డీగా నియమిస్తూ మున్సిపల్ అడ్మనిస్ట్రేషన్ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వేణుగోపాల్‌రెడ్డి హుటాహుటిన సూర్యా పేటకు బయలుదేరారు. గతంలో ఖమ్మం, కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా ఆయన పనిచేశారు.

TS government has appointed a special officer for Suryapet municipality

Latest Updates