డైలీ వర్కర్ కు రూ.300 ఇవ్వాలి: ప్రభుత్వం

ts-government-has-issued-orders-on-daily-monthly-workers-salaries

కనీస వేతనాల ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న డైలీ, నెలవారీ కార్మికులకు ఇచ్చే జీతానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దినసరి కూలీకి రోజుకు రూ.300 ఇవ్వాలని, ఫుల్ టైమ్ వర్కర్ కు నెలకు రూ.8 వేలు, పార్ట్ టైమ్ వర్కర్ కు నెలకు రూ. 4 వేలు ఇవ్వాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.  ఈ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ శాఖలు, కలెక్టరేట్లు, కోర్టులు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు అమలు చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

TS government has issued orders on daily, monthly workers salaries

Latest Updates