అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు జీవో విడుదల

హైద‌రాబాద్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. బాబా సాహెబ్‌ 125వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీమేరకు.. విగ్ర‌హ ఏర్పాటు కు సర్కార్‌ అడుగులు వేస్తోంది. హుస్సేన్‌సాగర్‌ సమీపంలో 11 ఎకరాల స్థలంలో 125 అడుగుల విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇందుకు సంబంధించిన విగ్రహ నమూనాను మంత్రి ఈటల రాజేందర్ బుధ‌వారం ‌ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి రూ.140 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అంబేద్కర్ విగ్రహంతో పాటు అంబేద్కర్ పార్క్, మ్యూజియం, లైబ్రరీ ఏర్పాటు చేస్తామని కొప్పుల ప్రకటించారు.

Latest Updates