కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్

కేసీఆర్ కమీషన్ల కోసమే ప్రాజెక్టుల అంచనాలు పెంపు

మన వాటా కృష్ణా నీళ్లను ఏపీ మళ్లించుకుపోతోంది

ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలి: కోదండరాం

సుప్రీం 1956లో ఏర్పాటు చేసిన ట్రిబ్యునళ్లు బాగా పన్జేస్తున్నయ్: జస్టిస్‌‌‌‌ చంద్రయ్య

జగన్‌‌‌‌తో కేసీఆర్‌‌‌‌ కుమ్మక్కయ్యారు: జితేందర్​రెడ్డి

దొంతుల లక్ష్మీనారాయణ రాసిన ‘షేరింగ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కృష్ణా రివర్‌‌‌‌ వాటర్‌‌‌‌ పోతిరెడ్డిపాడు ఇష్యూ’ పుస్తకావిష్కరణ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మన నీళ్లు మనకు దక్కేలా రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్లు ప్రాజెక్టులకు డిజైన్లు చేస్తే.. కాంట్రాక్టర్లకు లాభం చేసేందుకు కేసీఆర్​ వాటికి రీ డిజైన్లు చేశారని టీజేఎస్‌‌‌‌ చీఫ్​ ప్రొఫెసర్‌‌‌‌ కోదండరాం ఆరోపించారు. ప్రాణహిత –- చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్​ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి ప్రజలపై ఎంతో భారం మోపారని మండిపడ్డారు. రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్లు జూరాల నుంచి పాలమూరు –– రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టాలని డిజైన్‌‌‌‌ చేస్తే.. దాన్ని కేసీఆర్‌‌‌‌  శ్రీశైలంకు మార్చారని అన్నారు. కృష్ణా నీటిలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను కూడా మళ్లించుకుపోయేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని, ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్ల విషయంలో గట్టిగా మాట్లాడినవాళ్లంతా ఇప్పుడు మౌనంగా ఉన్నారని, ఇది తెలంగాణకు ప్రమాదకరమని చెప్పారు. రిటైర్డ్ ఇంజనీర్ దొంతుల లక్ష్మీనారాయణ రాసిన‘‘షేరింగ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కృష్ణా రివర్‌‌‌‌ వాటర్‌‌‌‌ పోతిరెడ్డిపాడు ఇష్యూ’’ పుస్తక ఆవిష్కరణ సభ శుక్రవారం ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇంజనీర్స్‌‌‌‌లో తెలంగాణ ఇంజనీర్స్‌‌‌‌ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించారు. పుస్తకాన్ని హెచ్‌‌‌‌ఆర్సీ చైర్మన్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ చంద్రయ్య  ఆవిష్కరించారు.  సభలో కోదండరాం మాట్లాడుతూ.. ప్రజలందరికీ నీళ్ల దోపిడీని తెలియజేసేందుకు లక్ష్మీనారాయణ ఈ పుస్తకాన్ని తీసుకువచ్చి మంచి పనిచేశారన్నారు. రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌ దివంగత హనుమంతరావు లేని లోటును లక్ష్మీనారాయణ తీరుస్తున్నారని అభినందించారు.

జలవివాదాల పరిష్కారానికి దిక్సూచి కావాలి: జస్టిస్​ చంద్రయ్య

ఇంటర్‌‌‌‌ స్టేట్‌‌‌‌ వాటర్‌‌‌‌ డిస్ప్యూట్స్‌‌‌‌ను పరిష్కరించేందుకు ఈ పుస్తకాన్ని దిక్సూచిలా ఉపయోగించుకోవాలని జస్టిస్‌‌‌‌ చంద్రయ్య అన్నారు. కృష్ణా నీళ్ల పంపిణీ, వివాదాల పరిష్కారానికి ఇది ఎంతో సహకరిస్తుందని చెప్పారు.  అంతర్రాష్ట్ర నదీ జలవివాదాల పరిష్కారానికి సుప్రీంకోర్టు 1956లో ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసిందని, అవి సక్సెస్‌‌‌‌ ఫుల్‌‌‌‌గా పనిచేస్తున్నాయన్నారు.

ఒక్క రైతు కూడా సంతోషంగా లేడు: జితేందర్​రెడ్డి

ఏపీ సీఎం జగన్‌‌‌‌తో కేసీఆర్‌‌‌‌ కుమ్మక్కై పోతిరెడ్డిపాడు విస్తరణకు సహకరిస్తున్నారని బీజేపీ నేత జితేందర్‌‌‌‌రెడ్డి అన్నారు. ఏపీ వేగంగా ప్రాజెక్టులు కడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేడని, కేసీఆర్‌‌‌‌ మాత్రం కమీషన్లు దండుకుంటూ సంతోషంగా ఉన్నారన్నారు.  ప్రొఫెసర్‌‌‌‌ రమేశ్‌‌‌‌రెడ్డి, కృష్ణమూర్తి, హన్మంత్‌‌‌‌రెడ్డి, డీపీ రెడ్డి, కవిత చల్లా , అంబటి నాగయ్య, పాశం యాదగిరి, అనంతరెడ్డి, రంగయ్య తదితరులు
పాల్గొన్నారు.

సంగమేశ్వరం పూర్తయితే  దక్షిణ తెలంగాణ ఎడారే: వివేక్​ వెంకటస్వామి

ఏపీ సంగమేశ్వరం నుంచి రోజుకు 5 టీఎంసీలు అక్రమంగా ఎత్తిపోసేందుకు పనులు చేపట్టిందని బీజేపీ కోర్‌‌‌‌ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. 3 టీఎంసీలను ఎత్తిపోసేందుకే పనులు చేస్తున్నామని బయటికి చెప్తున్నా.. 5 టీఎంసీలు లిఫ్ట్‌‌‌‌ చేసేలా పంపులు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరు –- రంగారెడ్డి ప్రాజెక్టు పంపులకు రూ. 850 కోట్లతో ఎస్టిమేషన్‌‌‌‌ సిద్ధం చేస్తే రూ. 2,250 కోట్లకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు లాభం చేశారని మండిపడ్డారు. ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టులో ఇంకో రూ. 25 వేల కోట్లు ఖర్చు చేస్తే మొత్తం ఆయకట్టుకు నీళ్లు వచ్చేవని, ఆ పనులను పక్కన పెట్టి కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం కడుతున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టును 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచడం వెనుక ఎన్నో కుంభకోణాలు ఉన్నాయని.. అలా పెరిగిన ఖర్చు కమీషన్ల రూపంలో కేసీఆర్‌‌‌‌కు చేరిందని, ఆయన కమీషన్ల చంద్రశేఖర్‌‌‌‌రావు అయ్యారని దుయ్యబట్టారు. కాళేశ్వరం కట్టినందుకే మేఘా కృష్ణారెడ్డికి ఫోర్బ్స్‌‌‌‌ జాబితాలో చోటు దక్కిందని, అంటే ఆయన సంపద ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టుల విషయంలో లక్ష్మీనారాయణ తనకు గురువులాంటి వారన్నారు.

డబుల్ బెడ్‌రూం ఇళ్లు అమ్మినా.. కిరాయికి ఇచ్చినా పట్టా రద్దు

అది నా బెస్ట్‌.. అందుకే వీడియో మళ్లీ మళ్లీ చూస్తున్నా..

ఫ్రెండ్ షిప్ పేరుతో ట్రాప్‌‌‌‌‌‌‌‌.. గిఫ్ట్‌లు తెచ్చామంటూ మోసాలు

హోమ్‌‌ లోన్లపై ఎస్‌‌బీఐ గుడ్‌‌న్యూస్


Latest Updates