మహిళా ఆర్టిస్టుల భద్రత కోసం ప్రభుత్వ ప్యానెల్ ఏర్పాటు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని సినీ నటి శ్రీరెడ్డి గతంలో చేసిన ఆరోపణలపై స్పందించింది సర్కార్. శ్రీరెడ్డికి మద్దతుగా మహిళా సంఘాలు వేసిన పిటిషన్ ను పరిగణనలోకి తీసుకుంది. మహిళా ఆర్టిస్టుల రక్షణ కోసం ప్యానల్ ఏర్పాటుకు సంబంధించి జీవోను విడుదల చేసింది.

నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కాలేజీ డాక్టర్ రమాదేవి, సామాజిక కార్యకర్త విజయ లక్ష్మిలతో ఈ కమిటీ ఏర్పాటైంది. ఇందులో సినీనటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ,  దర్శకురాలు నందిని రెడ్డిలను టాలీవుడ్ ప్రతినిధులుగా నియమించింది సర్కార్. సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలను ఎవరైనా వేధిస్తే ఈ కమిటీ ముందు నిర్భయంగా చెప్పవచ్చని,.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు చెప్పారు.

Latest Updates