63 శాతం పీఆర్సీ ఇవ్వాలి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 63 శాతం ఫిట్ మెంట్ పీఆర్సీ ఇవ్వాలని తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు పద్మాచారి డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్​లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన రాష్ట్ర  కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగుల రిటైర్ మెంట్ వయసు 61 ఏళ్లకు పెంచాలని, కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకొని, పాత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వాలని, పాత ప్లేస్ లో వచ్చిన హెచ్ ఆర్ ఏ కొత్త జిల్లాల్లో అమలు చేయాలన్నారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని, ఉద్యోగులకు ఈహెచ్ఎస్ లో 60 % ప్రభుత్వం చెల్లించాలని, ఉద్యోగులకు వారానికి ఐదు రోజులు వర్కింగ్ డేస్ ఖరారు చేయాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Latest Updates