ఉద్యమంలో నమోదైన రైల్వేకేసులు విత్ డ్రా చేసిన ప్రభుత్వం

సెక్రటేరియట్ : తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన రైల్వే కేసులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, ఈటల రాజేందర్, వివేక్ వెంకట స్వామి, కోదండరాం, నాయిని, జగదీశ్‌రెడ్డి, దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు, స్వామిగౌడ్, శ్రవణ్, విఠల్, తదితరులపై సికింద్రాబాద్, వికారాబాద్, మంచిర్యాల రైల్వే పోలీస్ స్టేషన్లలో గతంలో కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రం కోసం రైల్వే స్టేషనల్లో రైలు రోకోలు నిర్వహించడంతో నాయకులపై ఈ కేసులు నమోదు చేశారు పోలీసులు. రైళ్లను అడ్డుకొని ఆనాడు నిరసన తెలిపారు తెలంగాణ నేతలు. అప్పుడు నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

Latest Updates