ఆర్టీసీ కార్మికుల వేతనాలపై విచారణ

హైదరాబాద్ : RTC అంశంపై హైకోర్టులో ఇవాళ్టి వాదనలు ముగిశాయి. కార్మికుల వేతనాలపై విచారణ 19వ తేదీకి వాయిదా పడింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటుపై విచారణ సోమవారానికి వాయిదాపడింది. ప్రధాన పిటిషన్ పై విచారణ పూర్తయ్యాక ఆర్టీసీ కార్మికుల జీతాల పిటిషన్ విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ ప్రొసీడింగ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం సీల్డ్ కవర్ లో హైకోర్టు ముందు ఉంచింది. జీవో వచ్చాక ప్రజల ముందు ఉంచుతామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మరోవైపు… ఆర్టీసీ రూట్ల ప్రైవేటుపై కేంద్రప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది హైకోర్టు.

వచ్చేవారంలోగా సెప్టెంబర్ నెల జీతాలు వచ్చేలా చూస్తామని తెలిపారు ఆర్టీసీ కార్మికుల తరఫు లాయర్లు. దీనిపై కార్మికులు ఎట్టిపరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఉందా..లేదా అనే విషయంపై సోమవారం విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ యాక్ట్ ప్రకారం తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు.

Latest Updates