టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పెంపు

ts-icet-2019-application-deadline-extended

హైదరాబాద్, వెలుగు: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్–2019 దరఖాస్తుల గడువు తేదీని పొడగించారు.  శుక్రవారంతో ముగియనున్న గడువును లేటు ఫీజు లేకుండా ఈనెల 9 వరకు పొడగిస్తున్నట్లు ఐసెట్ కన్వీనర్ సీహెచ్ రాజేశం బుధవారం ప్రకటించారు. రూ.500 లేట్​ ఫీజుతో ఈ నెల12 వరకు, రూ.2000తో 14 వరకు, రూ.5000 తో 16 వరకు, రూ.10 వేల లేట్​ ఫీజుతో మే 18 వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 14 నుంచి హాల్ టికెట్లు డౌన్​లోడ్ చేసుకోవచ్చన్నారు. 23, 24 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

Latest Updates