కొత్త అప్పు రూ. లక్షన్నర కోట్లు !

ఆర్డినెన్స్ తో లైన్ క్లియర్ క్లి చేసుకున్న రాష్ట్ర సర్కార్
కార్పొరేషన్ల గ్యారంటీల క్లాజుకు సవరణ
90 శాతం లిమిట్ 200 శాతంగా మార్పు
ఇప్పటికే 2.90 లక్షల కోట్ల అప్పులు
హైదరాబాద్, వెలుగు: ఇప్పటికే రూ. 2.90 లక్షల కోట్లు అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరింత భారీ ఎత్తున అప్పులు తెచ్చేందుకు గేట్లు తెరిచింది. కార్పొరేషన్ల పేరుతో ఈ ఏడాది మరో రూ. 1.50 లక్షల కోట్లు అప్పు చేసేందుకు లైన్ క్లియర్ చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్ట మొచ్చినట్లు అప్పులు చేయకుండా కట్డడి చేసే ఎఫ్ఆర్ బీఎం లిమిట్ ను మన రాష్ట్ర ప్రభుత్వం సవరించుకుంది. మంగళవారం జారీ చేసిన ఆర్డినెన్స్ లో ఈ అంశాన్ని కీలకంగా ప్రస్తావించింది. కరోనా వ్యాప్తి , లాక్ డౌన్ కారణంగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఇటీవల ఎఫ్ఆర్బీఎం సడలింపులు ఇచ్చింది. కేంద్రం అనుమతి మేరకు ఎఫ్ఆర్ బీఎం లిమిట్ ను 3 శాతం నుంచి 5 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. అసెంబ్లీ సమావేశాలు లేనందున గవర్నర్ ఆమోదంతో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 2005 ఎఫ్ఆర్బీఎం యాక్ట్ 34 కు రెండు సవరణలను ఇందులో పొందుపరిచింది. ఇందులో ఉన్న రెండో సవరణ రాష్ట్ర ఖజానాను అప్పుల్లో ముంచెత్తే ప్రమాదముంది.

ఒక్క సవరణతో డబులైన అప్పు

ఎఫ్ఆర్ బీఎం పరిధిలో చేసే అప్పులన్నీ బడ్జెట్ పద్దుల్లో పొందుపరచటం తప్పనిసరి. కానీ కార్పొరేషన్ల పేరిట తెచ్చే అప్పులు బడ్జెట్డ్జె లో కనిపించవు. ప్రభుత్వం వీటిని గ్యారంటీలుగా చూపిస్తుంది. చివరకు..వీటిని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంగడిచిన ఆరేండ్లలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పవర్, ఇరిగేషన్ ప్రాజెక్టు లకు వివిధ కార్పొరేషన్లపేరిట రూ. 1.13 లక్షల కోట్లు అప్పులు తెచ్చింది. చట్టప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీలకు కూడా లిమిట్ ఉంది. రాష్ట్ర రెవెన్యూ రాబడిలో గ్యారంటీల మొత్తం 90 శాతం దాటకూడదని ఎఫ్ఆర్బీఎం చట్టంలోని తొమ్మిదో సెక్షన్ (డీ) క్లాజ్ లో ఉంది. తాజా ఆర్డినెన్స్ లో ప్రభుత్వం ఈ క్లాజ్ ను సవరించింది. 90 శాతం బదులుగా 200శాతం అనే పదాన్ని చేర్చింది. దీంతో కార్పొరేషన్ల పేరిట తెచ్చే అప్పులు రెవెన్యూ రాబడి కంటే డబుల్ కానుంది. అంటే రూ. 2 లక్షల కోట్లు దాటిపోతుందని, ఆదాయానికి మించి అప్పులతో తెలంగాణ భవితవ్యం ప్రశ్నార్ద‌కంగా మారుతుందని ఫైనాన్స్ సెక్టార్ ఎక్స్ పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న కాళేశ్వరం, మిషన్ భగీరథ, పాలమూరు.. తరహాలో అప్పుల కోసమే కొత్త కార్పొరేషన్లు పుట్టుకొస్తాయని అంటున్నారు.

బడ్జెట్లో చూపేది రూ.55 వేల కోట్లు

పెరిగిన ఎఫ్ఆర్బీఎం లిమిట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 55 వేల కోట్లు అప్పు చేయటం టార్గెట్ గా పెట్టుకుంది. 2020–21 బడ్జెట్ లో ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రూ. 33 వేల కోట్ల అప్పులు తీసుకుంటామని ప్రస్తావించింది. పెరిగిన లిమిట్ తో రూ. 55 వేల కోట్లు అప్పులు తెచ్చుకునేందుకు లైన్ క్లియ‌ర్ చేసుకుంది. వీటికి తోడు కార్పొరేషన్ల పేరిట తెచ్చే అప్పులతో ఈ ఏడాది చివరకు తెలంగాణ అప్పు రూ. 4 లక్షల కోట్లు దాటిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates