అమరవీరుల చరిత్రను రాష్ట్ర ప్రభుత్వం మరుగున పడేస్తుంది

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ అమరవీరుల చరిత్రను రాష్ట్ర ప్రభుత్వం మరుగున పడేస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అమరవీరుల చరిత్రను నేటి తరానికి తెలియజేసేందుకు రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ఉన్న ప్రాంతాలను  ఈ నెల 7, 8 తేదీల్లో బండి సంజయ్ సందర్శించానున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక,రేణికుంట, సిద్దిపేట జిలాలోని బైరాన్ పల్లి, కూటగళ్లు, ఆకునూరు, వరంగల్ రూరల్ జిల్లా పరకాల అమరధామం, నిజామాబాద్ జిల్లా దాశరథి జైలు, కుమ్రం భీం జిల్లాలోని జోఢేఘాట్, నిర్మల్ లోని వేయి ఊడలమర్రిని సంజయ్ విజిట్ చేయనున్నారు. ఇక..గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ బలోపేతంపైనా ఫోకస్ పెట్టింది బీజేపీ. ఇప్పటికే హైదరాబాద్ ను సంస్థాగతంగా ఆరు జిల్లాలుగా విభజించింది. ఇందులో భాగంగా ఆరుగురు పార్టీ అధ్యక్షుల నియామకంపై బండిసంజయ్, కిషన్ రెడ్డి, మురళీధర్ రావు చర్చించారు.

Latest Updates