TSPSC గుడ్ న్యూస్ : GHMC, బేవరేజెస్ లో ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), బేవరేజెస్ కార్పొరేషన్లలో ఉద్యోగాల భర్తీకి గురువారం (జూలై-19) రెండు వేర్వేరు నోటీఫికేషన్లు జారీ చేసింది TSPSC. GHMCలో 124 బిల్ కలెక్టర్లు, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లో పలు విభాగాల్లో 78 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని గ్రూప్‌ -4లో విలీనం చేయాలని భావించినా ఆయా పోస్టుల సర్వీసు నిబంధనలు వేరుగా ఉండటంతో ప్రత్యేక ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించింది TSPSC.  త్వరలోనే  హెల్త్‌ అసిస్టెంట్‌, శానిటరీ సూపర్‌ వైజర్‌ ఉద్యోగాలతో 85 ఉద్యోగాలకు మరో ప్రకటన ఇచ్చేందుకు కసరత్తు పూర్తిచేసినట్లు తెలిపింది. హెల్త్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు ఇంటర్‌ బయాలజీ, శానిటరీ సూపర్‌ వైజర్‌ కు డిగ్రీ బయాలజీ అర్హతలుగా ఉండే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates