TSPSC చైర్మన్ చక్రపాణి : అతి త్వరలోనే 20 వేల పోస్టులు భర్తీ

CHAKత్వరలో 20 వేల పోస్టులు భర్తీ చేస్తామన్నారు TSPSC చైర్మన్ ఘంటా చక్రపాణి. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా శనివారం (జూన్-2) TSPSC ఆఫీసులో జాతీయ జెండా ఎగరవేశారు ఘంటా. మూడు సంవత్సరాల్లో 12 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలోనే మరో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం వేలాది మంది త్యాగాలు చేశారని..అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో TSPSC సిబ్బంది నిద్రాహారాలు మాని, ఉద్యోగ భర్తీ కోసం పని చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర పున నిర్మాణానికి కావాల్సిన ఉద్యోగులను అందిస్తున్న సంస్ధ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నారు.

కొందరు కావాలనే ఉద్యోగుల నైతికతను, కమిషన్ రాజ్యాంగ బద్దతను దెబ్బ తీసే విదంగా మాట్లాడుతున్నారని..ఈ వ్యాఖ్యలు TSPSC ప్రతిష్టకు భంగం కలిగించే విదంగా ఉన్నాయన్నారు. తప్పుడు ప్రచారాలపై ఎవరు వ్యవహరించిన చట్ట పరమైన చర్యలు తప్పవని తెలిపారు ఘంటా. TSPSC చేయని తప్పులను, నియమకాలను తమపై మోపుతున్నారని, నిరుద్యోగులను నిరాశకు గురిచేసే విదంగా కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలను TSPSC ఉపేక్షించదన్నారు. త్వరలోనే 8 వేల ఫలితాలను ఇవ్వబోతున్నామని తెలిపిన చైర్మన్..అందులో TRT ఫలితాలూ ఉంటాయన్నారు. పూర్తిగా మెరిట్ లిస్టును జిల్లాల వారిగా ప్రకటిస్తామన్న ఆయన..ఈ నెలలోనే మరో రెండు మూడు ముఖ్యమైన నోటిఫికేషన్లను విడుదల చేస్తామన్నారు. గ్రూప్ 1 …125 ఉద్యోగాలు భర్తీ చేయలనుకున్నామని..అయితే జోనల్ వ్యవస్థ కారణంగా జాప్యం జరిగిందన్నారు. వారంలో టీచర్ నియామక పరీక్ష ఫలితాలు వెలువడే అవకాశం ఉందన్నారు. డిసెంబర్ వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లు ఇస్తామన స్పష్టం చేశారు TSPSC చైర్మన్ ఘంటా చక్రపాణి.

Posted in Uncategorized

Latest Updates