విన్నర్ నిర్మల : గ్రూప్ 2 ఫలితాల్లో స్టేట్ ఉమెన్ టాపర్

ఏడేళ్ల కిందట గ్రూప్​ 2 తన డ్రీమ్​. అప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టింది. ఈలోగా పెళ్లయింది. ఒక బాబు. గతంలో ఫార్మసీ కాలేజీలో ఫ్యాకల్టీగా పని చేసిన అనుభవం. తర్వాత  సింగరేణిలో జూనియర్​ అసిస్టెంట్​ జాబ్ తనకు కలిసొచ్చాయి. కానీ.. తను అనుకున్న గోల్​ రీచ్​ కాలేదనే వెలితి వెంటాడింది.  పెద్ద ఉద్యోగం సాధించి తీరాలనే తపన వెంటాడింది. పట్టుదలతో పుస్తకం పట్టింది.  గ్రూప్​ 2 పరీక్షను టార్గెట్​గా పెట్టుకొని చదివింది. రిటన్​ టెస్ట్ అయ్యాక ఏడాది తర్వాత వచ్చిన ఇంటర్వ్యూను సైతం  అంతే కాన్పిడెన్స్​తో అటెంప్ట్ చేసింది. టీఎస్​పీఎస్​సీ విడుదల చేసిన  గ్రూప్​ 2 ఫలితాల్లో స్టేట్​ ఉమెన్​ టాపర్​గా నిలిచింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గౌరిగూడెంకు చెందిన దేవగిరి నిర్మల… ఆమె సక్సెస్​ జర్నీ తన మాటల్లోనే..

– సత్తుపల్లి, వెలుగు

ఏడేళ్ల కిందట 2012లో గ్రూప్‌‌‌‌–2కు ప్రిపరేషన్​ స్టార్ట్ చేసిన. పాత సిలబస్‌‌‌‌తోనే కోచింగ్ తీసుకున్న. కొత్త సిలబస్​తో ఎగ్జామ్​ కావటంతో కంగారుపడ్డ. ఫస్ట్ ఓవరాల్‌‌‌‌గా సిలబస్‌‌‌‌ను అర్థం చేసుకున్న. నేషనల్ హిస్టరీ, ఎకానమీలో మార్పేమీ లేదు. కొత్తగా చదవాల్సింది తెలంగాణ హిస్టరీ, ఉద్యమం అని తెలుసుకుని అకాడమి బుక్స్ తెచ్చుకున్న. కేవలం అకాడమి పుస్తకాలు చదివిన.

టాప్​ ర్యాంక్ వస్తదనుకోలే..

కాంపిటీటివ్‌‌‌‌లో వంద శాతం పేపర్ చేయలేం. కానీ మన ఎఫర్ట్ వంద శాతం ఉండాలి. స్టాండర్డ్ బుక్స్ తీసుకుని చదివి ఎక్కువసార్లు రివిజన్ చేస్తే జాబ్ గ్యారంటీ. ఫస్ట్ రావాలని చదవలేదు.  కేవలం సర్వీస్ రావాలని టార్గెట్.  ఉమెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వస్తదని అనుకోలే. ఇంటర్వ్యూ చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో జరిగింది. మూస ధోరణిలో కాకుండా డిఫరెంట్‌‌‌‌గా ఉంది.  కరెంట్ ఇష్యూస్, సొసైటీపై అవగాహన వంటి విషయాల్లో ప్రశ్నలడిగారు. మన గురించి, తెలంగాణ సమాజం గురించి ఎంత తెలుసని బోర్డు సభ్యులు అంచనా వేసే ప్రయత్నం కనిపించింది.

పుస్తకం పక్కన పడేస్తా..

బాబును అమ్మ దగ్గర ఉంచి చదువుకున్న.  ఇన్ని గంటలు చదవాలని రూల్ పెట్టుకోలేదు.  సబ్జెక్ట్ ఎక్కట్లేదు అనుకున్నప్పుడు పుస్తకం పక్కన పడేసిన.  మైండ్‌‌‌‌కి ఎంత పని చెప్తామో అంతే రెస్ట్ ఇవ్వాలి అనుకునేదాన్ని. దీంతో నెక్ట్స్ టైం చదివేటప్పుడు ఈజీ ఉండేది.  డైలీ న్యూస్ పేపర్ చదివి క్లిప్పింగ్స్ కట్ చేసుకున్నా. వాటిని మళ్లీ రివిజన్ చేసిన.  గ్రూప్‌‌‌‌–2 ప్రిపేరయ్యేవాళ్లందరికీ ఒకటే చెప్తా. సిలబస్ అర్థం చేసుకుని స్టాండర్డ్ బుక్స్ చదవాలి.  బిట్లుగా కాకుండా సబ్జెక్ట్ చదవాలి. ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు.  కాన్ఫిడెంట్‌‌‌‌గా చదవండి. మా నాన్న దేవగిరి కేశవరెడ్డి, అమ్మ విజయలక్ష్మి. ఊళ్లోనే వ్యవసాయం చేస్తారు. మా ఆయన వెంకటేశ్వరరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌. 2016లోనే నాకు సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది. అది చేసుకుంటూనే గ్రూప్–2 రిజల్ట్స్ కోసం వెయిట్ చేసిన. లేటుగా వచ్చినా.. టాప్​ ర్యాంక్​ రావటం సో హ్యాపీ. గ్రూప్–1 నోటిఫికేషన్ పడితే మళ్లీ రాస్తా..!

– సత్తుపల్లి, వెలుగు

సబ్జెక్ట్‌‌పై అవగాహన

సొంతంగా నోట్స్ ఏం రాసుకోలేదు. కానీ ఎక్కువ సార్లు రివిజన్ చేసిన. బిట్‌‌వైజ్ కాకుండా  సబ్జెక్ట్ చదువుకున్న. దీంతో ఏ బిట్​ వచ్చిన చేస్తాననే నమ్మకం కుదిరింది. ఈసారి గ్రూప్‌‌–2 లో ఇచ్చిన ప్రశ్నలన్నీ  సబ్జెక్ట్‌‌పై అవగాహన ఉందా లేదా అన్న కోణంలోనే అడిగారు. పేపర్–1 లో మ్యాథ్స్ సరిగా చేయలేదు. ఎగ్జామ్​ రాసొచ్చి బాధపడ్డా. అందరిదీ అదే పరిస్థితని  చెప్పడంతో మిగతా పేపర్లు హ్యాపీగా రాసిన.

Latest Updates