టీఆర్టీ ఎస్జీటీ తెలుగు మీడియం ఫలితాలు విడుదల

హైదరాబాద్‌‌, వెలుగు: టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ (టీఆర్టీ) ఎస్జీటీ తెలుగు మీడియం అభ్యర్థుల తుదిజాబితాను టీఎస్‌‌పీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. టీఆర్‌‌టీపై హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్‌‌16 వరకు అభ్యర్థుల నుంచి మరోసారి రీలింక్విష్‌‌మెంట్‌‌ తీసుకున్న టీఎస్‌‌పీఎస్సీ ఆపై అడిషనల్‌‌గా క్వాలీఫై అయిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌‌ నిర్వహించింది. మొత్తం3,786 పోస్టులకు 3,325 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను శుక్రవారం రాత్రి నుంచి వెబ్‌‌సైట్‌‌లో ఉంచుతామని టీఎస్‌‌పీఎస్సీ అడిషనల్‌‌ సెక్రటరీ ఆర్‌‌. సుమతి వెల్లడించారు.

Latest Updates