TSRJC ప‌రీక్ష వాయిదా

లాక్ డౌన్ కార‌ణంగా ఇప్ప‌టికే ప‌లు ఎంట్రెన్స్ పరీక్ష‌లు వాయిదా ప‌డ్డ విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో ఎంట్రెన్స్ ప‌రీక్ష వాయిదా వేసిన‌ట్లు తెలిపారు అధికారులు. రాష్ట్రంలోని గురుకుల జూనియ‌ర్ కాలేజీల్లో ప్ర‌వేశానికి నిర్వ‌హించే TSRJC ప‌రీక్ష వాయిదా ప‌డింది. మే-10న నిర్వ‌హించాల్సిన ప‌రీక్ష‌ను వాయిదా వేశామ‌ని అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసింది TSRJC.

ఈ మేర‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువును జూన్ -1వ తేదీ వ‌ర‌కు పొడిగించిన‌ట్లు తెలిపారు TSRJC కార్య‌ద‌ర్శి వెంక‌టేశ్వ‌ర శ‌ర్మ‌. TSRJC ప‌రీక్ష‌కు సంబంధించిన ఫీజు చెల్లింపు, చివ‌రి తేదీతో స‌హా మ‌రేవైనా సందేహాలుంటే 040 24734899, 9490967222 నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించాల‌ని తెలిపారు.

Latest Updates