బస్సు ఎక్కడుందో వెతకండి : రవాణా శాఖ

హైదరాబాద్ : TSRTCకి చెందిన బస్సు కనిపించకపోవడంతో డిపోలో కలకలం రేపుతోంది. కుషాయిగూడ డిపోకి చెందిన మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు  దొంగిలించబడింది. దీనిపైన గురువారం అధికారులతో రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బస్సు ఎక్కడుందో కనిపెట్టాలని, టోల్ ప్లాజా దగ్గర నిఘా పెట్టాలని నగర్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించారు మంత్రి. సిటీలోని అన్ని డిపోలు, బస్ స్టేషన్లలో భద్రత, నిఘా ఉండేలా చూడాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. భాద్యులపైన చర్యలు తీసుకోవాలని సీరియస్ అయ్యారు.

బస్సు మిస్ అయ్యింది ఇలా..

కుషాయిగూడ డిపోకు చెందిన మెట్రో (AP11Z 6254) బస్సు రోజూ కుషాయిగూడ – అఫ్జల్‌గంజ్‌ మధ్య నడుస్తుంది.మంగళవారం రాత్రి 11.02 గంటలకు అఖరి ట్రిప్‌ పూర్తయ్యాక బస్సు డ్రైవర్‌ వెంకటేశం, కండక్టర్‌ రాహుల్‌ బస్సును CBS డిపో-1లో పార్క్‌ చేశారు. తర్వాత విశ్రాంతి గదికి వెళ్లి పడుకున్నారు. బుధవారం లేచి చూసేసరికి బస్సు కనిపించలేదు. బస్సు కోసం డిపోలో అంతటా వెతికారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆచూకీ కనిపించకపోవడంతో అఫ్జల్‌ గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates