అమ్మో 90 మందా… బస్సు నేను నడప

సాధారణంగా ఆర్టీసీ బస్సులో 40 నుంచి 50 మంది ఎక్కితేనే కిక్కిరిసిపోతుంది. అలాంటి కరీంనగర్ బస్టాండ్ లో మంచిర్యాల డిపోకు చెందిన బస్సులో ఏకంగా 90 మందికి పైగా ఎక్కారు. దీంతో ఏం చేయాలో తెలియక తాత్కాలిక డ్రైవర్ బస్సు దిగి వెళ్లిపోయాడు. మంచిర్యాల ​వెళ్లే బస్సు కోసం కరీంనగర్ బస్టాండ్ లో 4 గంటల నుంచి ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు.

సాయంత్రం 6 గంటలకు ఒక బస్సు రావడంతో దాదాపు 90 మంది అందులోకి ఎక్కారు. దీంతో బస్సును వదిలేసి డ్రైవర్ వెళ్లిపోయాడు. గంట తర్వాత విషయం తెలిసి డిపో మేనేజరు 20 మంది వరకు ప్రయాణికులను దించి మరో బస్సులో ఎక్కించారు. ఆ తర్వాత బస్సు బయలుదేరి వెళ్లింది.  – కరీంనగర్ క్రైం, వెలుగు

Latest Updates