ఊరేళ్ళనడానికి బస్సు లేదని.. ఏకంగా బస్సే దొంగతనం

ఎవరైనా సరే ఊరేళ్ళనడానికి బస్సులను ఆశ్రయిస్తారు. ఒకవేళ సమయానికి బస్సు సౌకర్యం లేకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కుంటాము. కానీ, ఇక్కడో ప్రబుద్ధుడు మాత్రం తాను వెళ్లడానికి బస్సులేదని ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగతనం చేసి తాను వెళ్లాల్సిన ప్రాంతానికి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి వికారాబాద్ జిల్లాలో జరిగింది. స్థానిక బస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక వ్యక్తి తన పని పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి బస్ టెర్మినల్ దగ్గరికి వచ్చాడు. కానీ, అక్కడ ఏ బస్సు లేకపోవడంతో… అదే బస్ స్టాండ్‌లో హాల్ట్ చేసి ఉంచిన బస్సును దొంగతనంగా తీసుకొని వెళ్లాడు. ఆ వ్యక్తి తన గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత బస్సును అక్కడే వదిలేసి పారిపోయాడు. డిపో మేనేజర్ ఫిర్యాదుతో.. సీసీ ఫుటేజీ ద్వారా ఆ వ్యక్తిని గుర్తించామని పోలీసులు తెలిపారు. బస్సును దొంగతనంగా తీసుకెళ్లిన వ్యక్తిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates