గుండెపోటుతో ఆర్టీసీ కార్మికుడు మృతి

హైదరాబాద్, వెలుగు: మరో ఆర్టీసీ కార్మికుడు గుండెపోటు చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపోలో బూడిది జంగయ్య(52) శ్రామిక్​గా విధులు నిర్వహించేవారు. అనారోగ్యంతో  రెండు నెలలుగా సెలవులో ఉన్నారని, ఉద్యోగాలు  పోయినట్టేనన్న  సర్కారు  ప్రకటనతో  మానసిక  వేదనకు  గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు.  మంగళవారం  సాయంత్రం  హైదరాబాద్ లోని  కాచిగూడ ప్రతిమ  ఆసుపత్రిలో గుండెపోటుతో  మరణించినట్లు చెప్పారు.  బూడిది జంగయ్య స్వగ్రామం మంచాల మండలం లోయపల్లి. మృతుడికి బార్య సుగు ణమ్మ, ఇద్దరు కొడుకులు కిరణ్​, వెంక టేష్​, కూతురు విజయ ఉన్నారు.

Latest Updates