ప్రతీ డిమాండ్ పై చర్చ జరిగేంతవరకు సమ్మె ఆపేది లేదు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనన్నారు జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి. విలీనం డిమాండ్ ను వెనక్కి తీసుకుంటామని తాము ఎక్కడ అనలేదన్నారు. అలా అన్నామని నిరూపిస్తే ఉరి శిక్షకైనా సిద్ధమేనన్నారు. దిల్ సుఖ్ నగర్ డిపో వద్ద  వంటావార్పు కార్యాక్రమానికి జేఏసీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అశ్వత్థామ రెడ్డి ఏ ఒక్క డిమాండ్ పై వెనక్కి తగ్గేది లేదన్నారు. కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విదంగా మాట్లాడొద్దన్నారు. ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ హత్యలన్ని ప్రభుత్వ హత్యలేనని అన్నారు. చర్చలకు పిలవడం మీ ఇష్టం  కానీ అబద్దాలు చెప్పొద్దన్నారు.ఆర్టీసీని విలీనం చేయడానికి ఇబ్బందులు ఏంటో చెప్పాలన్నారు. ప్రతీ డిమాండ్ పై చర్చ జరిగేంతవరకు  సమ్మె ఆపేది లేదన్నారు. 24న ఇందిరాపార్క్ వద్ద మహిళ కార్మికుల ఆధ్వర్యంలో దీక్ష చేపడతామన్నారు.

ఆర్టీసీ సమ్మె చరిత్రాత్మకం: తమ్మినేని
సీఎం బాబు దిగివచ్చిన సమ్మెను ఆపలేరని సీపీఎం  తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చాలా స్ఫూర్తి, పట్టుదలతో కార్మికులు సమ్మె చేస్తున్నారని అన్నారు. ప్రైవేటీకరణ అంటే కార్మికుల మెడమీద కత్తి పెట్టినట్లేనని.. కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని అన్నారు. ఆర్టీసీ సమ్మె చారిత్రాత్మకమని అన్నారు.

Latest Updates