డ్యూటీకి ఎందుకు వస్తలేరు?… అశ్వత్థామ రెడ్డికి ఆర్టీసీ చార్జిషీట్‌‌

డ్యూటీకి ఎందుకు వస్తలేరు?

అశ్వత్థామ రెడ్డికి ఆర్టీసీ చార్జిషీట్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: అనుమతి లేకుండా డ్యూటీకి రాకపోవడంపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌‌, టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డికి ఆర్టీసీ ఆఫీసర్లు చార్జీషిట్‌‌ జారీ చేశారు. డ్యూటీకి రాకపోవడంపై వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. సెలవులు కావాలని డిసెంబర్‌‌ 12న అశ్వత్థామ రెడ్డి అప్లై చేసుకోగా, కొన్ని కారణాలతో క్యాన్సిల్ చేశారు. డిసెంబర్‌‌ 23న ఎక్స్‌‌ట్రార్డినరీ లీవ్‌‌ కోసం అప్లై చేసుకోగా మళ్లీ రిజెక్ట్​ చేశారు. అయినా అశ్వత్థామరెడ్డి డ్యూటీకి రావడం లేదు. దీంతో జవనరి 24న మొదటి చార్జిషీట్‌‌ జారీ చేశారు.

Latest Updates