ఉద్యోగులను ‘కుక్క.. తోక’ అంటరా?

 సీఎంపై టీచర్‌‌ యూనియన్లు ఫైర్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ‘ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనలు చేస్తుంటే సమస్యలు పరిష్కరించకపోగా ‘కుక్క.. తోక’ అని మాట్లాడతారా?  తొలగిస్తామని బెదిరిస్తారా?’ అంటూ సీఎం కేసీఆర్‌‌పై టీచర్ల యూనియన్లు ఆదివారం మండిపడ్డాయి. ‘ఎంప్లాయ్‌‌ ఫ్రెండ్లీ సర్కారంటే ఇదేనా?’ అని నిలదీశాయి. ‘2018 మే 16న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో నాలుగున్నర గంటలు 18 సమస్యలపై సీఎం చర్చించారు. 13 సమస్యల పరిష్కారానికి అంగీకరించారు. కానీ ఏడాదిన్నరగా ఒక్క హామీ అమలు కాలేదు’ అని టీఎస్‌‌యూటీఎఫ్‌‌ రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌‌ రాములు, చావ రవి మండిపడ్డారు.రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘ కాలం ఉద్యోగులు సకల జనుల సమ్మె చేసిన విషయం మరచిపోవద్దన్నారు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రస్తుత ముఖ్యమంత్రే ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ నియంతగా వ్యవహరించటం సరికాదన్నారు. అనుచిత వ్యాఖ్యలను సీఎం ఉపసంహరించుకోవాలని డీటీఎఫ్‌‌ డిమాండ్‌‌ చేశారు.

Latest Updates