TTD అర్జిత సేవా టికెట్లు విడుదల

TTDతిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేసింది టీటీడీ. సెప్టెంబరు మాసానికి సంబంధించి 49వేల 60 టిక్కెట్లను శుక్రవారం (జూన్-1) ఉదయం 10గంటల నుంచి ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చింది.  మొత్తం టిక్కెట్లలో 8 వేల 235 సేవా టిక్కెట్లను ఆన్ లైన్  లాటరీ విధానంలోను, 40వేల 825 ఆర్జిత సేవా టిక్కెట్లను కరెంట్ బుకింగ్ సదుపాయం కింద అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. శుక్రవారం (జూన్-1) నుంచి నాలుగు రోజుల పాటు టికెట్ల నమోదు అవకాశం కల్పించింది.

 

ఆ తర్వాత డిప్‌ విధానంలో టిక్కెట్ల కేటాయింపు, నగదు చెల్లింపునకు అవకాశం ఇస్తుంది.  ఆన్‌ లైన్‌ జనరల్‌ కేటగిరి కింద విడుదల చేసిన విశేషపూజ, కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ టిక్కెట్లను వెంటనే బుక్‌ చేసుకోవచ్చు. ప్రతి నెలా 50వేలకు పైగా టిక్కెట్లు విడుదల చేస్తుండగా.. సెప్టెంబరులో వార్షిక బ్రహ్మోత్సవం క్రమంలో ఆర్జిత సేవల రద్దు కారణంగా కోటా చాలా వరకు తగ్గింది.

Posted in Uncategorized

Latest Updates