TTD పై రమణ దీక్షితులు ఆరోపణలు: 500 కోట్ల వజ్రం మాయం

Ramana-Deekshituluటీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు శ్రీవారి ఆలయంలో అక్రమాలపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. శ్రీవారికి అలంకరించిన ఐదు వందల యాభై కోట్ల రూపాయల విలువైన గులాబీ రంగు వజ్రం మాయం కావడం వెనుక సందేహాలున్నాయని ఆయన అన్నారు.ఇటీవల జెనీవాలో వేలం వేసిన వజ్రం గులాబి రంగు వజ్రాన్ని పోలిఉందన్నారు. ఆలయ ప్రాకారం పరిధిలోని పురాతన వంటశాలలో నగలు, వజ్రాల కోసం అక్రమంగా తవ్వకాలు జరిగాయన్నారు. సుమారు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శ్రీవారి వంటశాలను..ఎప్పుడూ మూసివేసింది లేదన్నారు. కానీ  తనకు తెలియకుండా 2017 డిసెంబర్ లో మూసివేశారన్నారు. పదో శతాబ్దంలో పల్లవులు, చోళులు స్వామికి ఇచ్చిన కానుకల కోసం అక్రమ తవ్వకాలు జరిగినా ఈవో లాంటి అధికారులు స్పందించడం లేదని చెప్పారు రమణ దీక్షితులు. ఇలా జరగడంతో ఎలాంటి వైపరిత్యాలు జరుగుతాయోనన్న భయంతో బయటకు చెప్పానన్నారు. దీంతోనే తనపై కక్ష సాధింపు ప్రక్రియ ప్రారంభమైందన్నారు రమణ దీక్షితులు.

Posted in Uncategorized

Latest Updates