ఇక భక్తులకు ఉచితంగా శ్రీవారి లడ్డూ

తిరుమల: నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుతమైన తీపి కానుకను అందించింది. శ్రీవారిని దర్శనానికి భక్తులు ఎంతగా ప్రాధాన్యమిస్తారో అంతే సమానమైన ఇంపార్టెన్స్ లడ్డూ ప్రసాదానికి కూడా ఇస్తారు. అలాంటి శ్రీవారి లడ్డూను ఇకపై వేంకటేశ్వరుడి దర్శనం చేసుకునే ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.

అంతేకాకుండా అదనంగా లడ్డూలు కావాలంటే ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండానే కౌంటర్లో నేరుగా కొనుగోలు చేసుకునే సౌలభ్యాన్ని సామాన్య భక్తులకు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. రానున్న వైకుంఠ ఏకాదశి నుంచి ఈ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నట్లు టీటీడీ తెలిపింది. టీటీడీ నిర్ణయంతో నెలకు 24 లక్షల లడ్డూలను ఉచితంగా భక్తులకు పంపిణీ చేసే అవకాశం ఉంది.

Latest Updates