వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన టీటీడీ

టీటీడీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్. తిరుమల అన్నమయ్యభవన్ లో సుధాకర్ యాదవ్ అద్యక్షతన సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో టిటిడి పాలకమండలి పలు కీలక  నిర్ణయాలు తీసుకున్నారు.

2019-20 గాను టీటీడీ వార్షిక బడ్జెట్ గా 3116కోట్ల రూపాయలను ప్రకటించారు. నీటి అవసరాలకు కళ్యాణ‌ డ్యాం వరకు పైప్ లైన్ నిర్మాణం కోసం 8.50 కోట్లు అమోదం తెలిపారు. తిరుమలలోని దక్షిన ప్రాంతంలోని కాటేజీలు నిర్వహణ కు A1 సంస్థకు మూడు సంవత్సరాల కాలపరిమితి గాను 36.50 కోట్లను రిలీజ్ చేయనున్నారు. తూర్పు బాగంలో ఉన్న కాటేజీలకు కల్పతరువు సంస్థకు మూడేండ్లకుగాను 17.50 కోట్లను కెటాయించారు. పడమర వైపు ఉన్న కాలేజీలకు మూడు సంవత్సరాల నిర్వహణ కు పద్మావతి సంస్థ కు 8.5 కోట్లు ఇవ్వనున్నారు.

శ్రీనివాసం అతిధి గృహం నిర్వహణకు పద్మావతి సంస్థకు 17. కోట్లు… పాంచజన్యం నిర్వహణ కు 12.50 కోట్లు…. F- type క్వార్టర్స్ ఆధునీకరణ  కోసం 3.65 కోట్లు…. బి టైప్ ఆధునీకరణ కోసం 45 కోట్ల 44 లక్షలు కెటాయించారు.

పద్మావతి, శ్రీనివాస కళ్యాణ మండపాలు అభివృద్ధి కి‌ టెండర్లను ఆహ్వానించనున్నారు. సులభ్ పారిశుద్ధ్య సంస్థకు నిర్వహణ మరో ఏడాది కాలం పొడిగించారు.

Latest Updates