TTD ఛైర్మన్‌ పదవి రేసులో లేను: మోహన్ బాబు

ttd-chairman-is-not-in-for-race-mohan-babu

సీనియర్‌ నటుడు,YCP నేత మోహన్‌ బాబు తనపై మీడియాలో వస్తున్న వార్తలపై స్పదించారు. మోహన్‌బాబు టీటీడీ చైర్మన్‌ రేసులో ఉన్నట్టుగా వస్తున్న పుకార్లను ఆయన కొట్టిపారేశారు. తాను ఎలాంటి పదవులు ఆశించిన రాజకీయాల్లోకి రాలేదని ట్విట్టర్ ట్వీట్ చేశారు.

‘నేను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ రేసుల్లో ఉన్నట్టుగా వార్తలు, ఫోన్‌ కాల్స్ వస్తున్నాయి. నా ఆశయం YS జగన్మోహన్  రెడ్డిని సీఎంగా చూడటం. అందుకోసం నా వంతుగా కష్టపడ్డాను. నేను తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కారణం  జగన్‌ పై ఉన్న నమ్మకమే గాని ఎలాంటి పదవులు ఆశించి కాదు. మీడియాకు నా విన్నపం పుకార్లను ప్రోత్సహించకండి’ అంటూ మోహన్‌ బాబు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Latest Updates