శ్రీవారి లడ్డు ధర పెంపుపై స్పందించిన టీటీడీ చైర్మన్

చెన్నై: తిరుమలలో లడ్డు ప్రసాదం ధరలను పెంచుతున్నారంటూ వస్తున్న వదంతులను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. ధరలను పెంచట్లేదని, వదంతులను నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ స్థలాన్ని టీటీడీ చైర్మన్‌, టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు శేఖర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లఢారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు నుండి కూడా భక్తులు తిరుమలకు ఎక్కువగా వస్తారని ఆయన అన్నారు. భక్తులను ఇబ్బంది పెట్టే విధంగా టీటీడీ బోర్డు ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని ఆయన స్పష్టం చేశారు.

Latest Updates