ఎల్లుండి ఆదివారం టీటీడీ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

డయల్ చేయాల్సిన నెంబరు 0877-2263261.

ఉదయం 9 నుండి 10 వరకు గంటపాటు కార్యక్రమం

తిరుపతి: భక్తుల ఇబ్బందులు.. సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించే డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మాన్ని టీటీడీ ఎల్లుండి ఆదివారం నిర్వహించనుంది. తిరుప‌తిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో ముఖ్యమైన అధికారుల సమక్షంలో డయల్ యువర్ కార్యక్రమం జరుగుతుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది. ఈ సమయంలో భక్తులు చేసే ఫోన్ కాల్స్ ను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వయంగా లిఫ్ట్ చేసి మాట్లాడతారు. భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

 

Latest Updates