శుభవార్త.. పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల: శ్రీవారి భక్తులుకు టీటీడీ ఓ శుభవార్త అందించనుంది.  వచ్చే ఏడాది జనవరి 6,7 తేదీలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా  10 రోజులు పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి వుంచాలని భావిస్తోంది.  ఇప్పటి వరకూ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినం రోజులోనే భక్తులును వైకుంఠ ద్వారం గుండా అనుమతిస్తున్న టీటీడీ. . భక్తులు రద్దీని దృష్టిలో వుంచుకోని 10 రోజులు పాటు ఆ మహా ద్వార దర్శన భాగ్యం కల్పించనుంది.

వైకుంఠ ద్వార మహోత్సవం పేరుతో  ద్వారాలను తెరవాలని టీటీడీ భావిస్తోంది. 10 రోజులు పాటు వైకుంఠ ద్వారాల గుండా భక్తులును అనుమతించేందుకు ఆగమ సలహ మండలి అంగీకరించింది.  ఇక పాలకమండలి  కూడా ఆమోదం తెలిపితే వచ్చే ఏడాది జనవరి నుంచే  ఈ నూతన విధానం అమలులోకి రానుంది.

TTD hopes to offer lord Srinivasa devotees Vaikuntha Dwara Darshan for ten days

Latest Updates