టీటీడీ: తిరుమలలో వసతి గదుల అద్దె భారీగా పెంపు

దాదాపు డబులు చేసిన టీటీడీ.. వెంటనే అమలు

తిరుమలలో భక్తులకు అద్దెకు ఇచ్చే వసతి గదుల అద్దెను భారీగా పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. పలు గెస్ట్ హౌస్ లలోని గదుల రెంట్ ను దాదాపు డబుల్ చేసింది. ఈ నిర్ణయంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులపై భారం పెరగనుంది.

నందకం గెస్ట్ హౌస్ లోని వసతి గదుల రోజుకు అద్దె రూ.600గా ఉండేది. దీనిని వెయ్యి రూపాయలకు పెంచింది టీటీడీ. అలాగే కౌస్తుభం, పాంచజన్యంలో రూ.500 ఉన్న కిరాయిని నుంచి 1000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన దరలను నేటి (గురువారం) నుంచే అమలు చేస్తున్నట్లు తెలిపింది టీటీడీ. ఈ రేట్ల పెంపుతో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఖర్చులు మరింత ఎక్కువ అవుతాయని సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే రూ.50, 100 అద్దె గదులు ఎప్పటిలాగే పాత దరలతోనే కొనసాగుతాయని అధికారులు చెప్పారు.

Latest Updates