శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేసిన టీటీడీ

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) మంగళవారం విడుదల చేసింది. నవంబర్ నెలకు సంబంధించి కోటాను TTD వెబ్ సైట్ లో అందుబాటులో ఏర్పాటు చేసింది. ప్రతి రోజూ ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు టికెట్లు ఇవ్వనున్నారు.

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వివిధ స్లాట్లలో నిత్యం 19 వేలు ఇవ్వనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. టికెట్లు పొందిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించనున్నట్లు TTD స్పష్టం చేసింది. లేని వారిని అలిపిరి తనిఖీ కేంద్ర దగ్గరే అధికారులు నిలిపేస్తున్నారు. అంతేకాదు పూర్తిగా కరోనా నిబంధనల ప్రకారమే భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు అధికారులు.

Latest Updates