తిరుమలలో VIP దర్శనాలకు బ్రేక్

తిరుమల: ప్రపంచంలోనే ఫేమస్ దైవక్షేత్రాల్లో ఒకటైన తిరుమలకు విచ్చేసే VIPలకు కాస్త నిరాశ కలగనుంది. VIP లెటర్ చూపిస్తే చాలు క్షణాల్లో దర్శనం చేసుకునే ప్రముఖులు.. ఇక సాధారణ క్యూలోనే వెళ్లక తప్పదు. అయితే.. ఈ రూల్ ఎక్కువ రోజులు కాదులెండి. త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీటీడీకీ ఎన్నికల కోడ్ తప్పలేదు.

దీంతో VIP దర్శనాలకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది TTD. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇదే రూల్ అమలులో ఉంటుందని చెప్పింది. దీనిని దృష్టిలో పెట్టుకుని సిఫార్సులను పంపకుండా స్వచ్ఛందంగా నిలిపి వేస్తున్నారు కొందరు ప్రజాప్రతినిధులు.

See Also: రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ పై ముగిసిన విచారణ

Latest Updates