ఇక సామాన్యులకు శ్రీవారి ‘వడ’ ప్రసాదం

సిఫారసు లేకుండానే కౌంటర్లలో కొనుగోలుకు అవకాశం

తిరుమల, వెలుగు:  సామాన్య భక్తులు కల్యాణోత్సవం లడ్డూతోపాటు వడప్రసాదం కూడా పొందే సౌకర్యాన్ని టీటీడీ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. రూ.200 విలువైన 750 గ్రాముల కల్యాణోత్సవం లడ్డూలు, రూ.100 విలువైన వడ ప్రసాదం పలుకుబడి, సిఫారసు లేఖలు  ఉన్నవారికి మాత్రమే దొరికేవి. దీన్ని నివారించేందుకు ఈ నెల 12 నుంచి టీటీడీ కల్యాణోత్సవం లడ్డూలను కౌంటర్లలో అందుబాటులోకి తెచ్చింది. సిఫార్సు లేకుండానే సామాన్యులకు కల్యాణోత్సవం లడ్డూలు అందుతున్నాయి. ఇదే తరహాలో ప్రతి రోజు 10 వేల కల్యాణం లడ్డూలు, 10 వేల వడ ప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి బుధవారం తెలిపారు.

see also: భారతీయుడు2 షూటింగ్​లో ప్రమాదం

రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు ఆగింది!

సర్కార్ ఫోకస్ : రిటైర్మెంట్​ ఏజ్​ 61

Latest Updates