శ్రీవారి భక్తులకు గుడ్​ న్యూస్​... ఏప్రిల్​ నెలకు అంగ ప్రదక్షణ టిక్కెట్లు రిలీజ్​

శ్రీవారి భక్తులకు గుడ్​ న్యూస్​... ఏప్రిల్​ నెలకు అంగ ప్రదక్షణ టిక్కెట్లు రిలీజ్​

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకేన్లు విడుదల చేసింది టీటీడీ పాలక మండలి. అలాగే శ్రీవారి దర్శన టిక్కెట్లు, వసతి గదులు కోటా విడుదల అయ్యయి.…ఏప్రిల్ నెలకు సంబంధించి సీనియర్ సిటిజన్లు/వికలాంగుల కోటా టికెట్లను ఇవాళ ( జనవరి 23)  మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. అలాగే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను జనవరి 24న అంటే రేపు  ( జనవరి 24) ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనుంది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.

తిరుమలలో ఎల్లుండి రామకృష్ణ తీర్ద ముక్కోటి జరుగనుంది. ఈ తరుణంలోనే..  గురువారం (జనవరి 25) ఉదయం 5 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతించనుంది టీటీడి. జనవరి 25న  పుష్యమాస పౌర్ణమి గరుడ సేవ ఉంటుంది. దీంతో ఆరోజజు  రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలలోని 09 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.సోమవారం జనవరి 22న  శ్రీవారిని 67,568 మంది భక్తులు దర్శించుకున్నారు. 22084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.58 కోట్లు వచ్చింది.