మున్సిపల్ బరిలో టీడీపీ

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న మున్సిపల్​ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్​ వెల్లడించారు. త్వరలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా అబ్జర్వర్లను నియమిస్తామని, తర్వాత సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. శనివారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​. రమణ, సీనియర్​ నేతలు రావుల చంద్రశేఖర్​ రెడ్డి, అరవింద్​ కుమార్​ గౌడ్​, నన్నూరి నర్సిరెడ్డి, ప్రొఫెసర్​ జ్యోత్స్నతో  పాటు పలువురు నేతలతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భేటీ అయ్యారు. గత వారంలో పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షించారు. ధర్నాచౌక్​లో టీఆర్​ఎస్​ ఏడాది పాలన వైఫల్యాలపై టీడీపీ చేపట్టిన మహాధర్నాపై నేతలను అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం పార్టీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్​, పార్టీ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్​ నాయక్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే 11 పార్లమెంట్ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమించామని, మిగతా నియోజకవర్గాలకు వచ్చే శనివారం నియమిస్తామని తెలిపారు. టీడీపీ లేదంటున్న వారికి మున్సిపల్​ ఎన్నికల్లో సత్తా చూపిస్తామన్నారు.

Latest Updates