TTL క్రికెట్ టోర్నమెంట్ : ఖమ్మంపై మెదక్ గ్రాండ్ విక్టరీ

JKHతెలంగాణ టీ20లో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి-9) సిద్దిపేటలో ఖమ్మంతో జరిగిన మ్యాచ్ లో మెదక్ విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో మెదక్ గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఖమ్మం..నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన మెదక్ ఒక్క వికెట్ నష్టానికి కేవలం 11.05 ఓవర్లలోనే 116 పరుగులు చేసి గెలిచింది.

 

మెదక్ బ్యాట్స్ మెన్లలో మల్లిఖార్జున్ 70 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలువగా..అభిరత్ రెడ్డి(26), ఆఫ్రిది(19) రన్స్ తో ఫర్వాలేదనిపించారు.  ఖమ్మం బౌలర్లలో గుప్తాకు ఒక్క వికెట్ దక్కింది.  ఖమ్మం బ్యాట్స్ మెన్లలో..   జునైద్ అలీ(49), సాయి కుమార్ (24) తప్పా మిగతా ప్లేయర్లు రాణించలేకపోయారు. మెదక్ బౌలర్లలో.. ప్రణీత్ రాజ్(2), భరత్ కుమార్ (2) చెరో రెండు వికెట్లు తీశారు.

Posted in Uncategorized

Latest Updates