TTL మ్యాచ్: నల్గొండ పై హైదరాబాద్ విక్టరీ

hyderabad-ttlవెంకటస్వామి తెలంగాణ టీట్వంటీ లీగ్ రెండో రౌండ్ లో భాగంగా… శనివారం(ఫిబ్రవరి-10) నల్గొండ లయన్స్, హైదరాబాద్ శ్రీనిధియన్ థండర్ బోల్ట్స్ జట్ల మధ్య మ్యాచ్ లో హైదరాబాద్ 3 రన్స్ తేడాతో విజయం సాధించింది.  టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న హైదరాబాద్ థండర్ బోల్ట్స్… దూకుడుగా ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 రన్స్ చేసింది. హైదరాబాదీ ఆటగాడు చందన్ సహానీ 44 రన్స్ చేశాడు. డేనీ ప్రిన్స్ 20, చైతన్య 15, వాహద్ 14, విటల్ అనురాగ్ 10 పరుగులు చేశారు.

నల్గొండ బౌలర్లో సాయి అభినయ్ 2 వికెట్లు తీసుకోగా.. వరుణ్ గౌడ్, లలిత్ మోహన్, సురేందర్, వంశీ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు.

131 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన నల్గొండ లయన్స్.. దాదాపుగా ఆరు పరుగుల రన్ రేట్ తో పరుగులు చేసింది. పోటాపోటీగా స్కోర్ చేసినప్పటికీ … విజయానికి 4 పరుగుల దూరంలోనే నిలిచిపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి నల్గొండ లయన్స్ 127 రన్స్ మాత్రమే చేసింది. శశిధర్ రెడ్డి 30, కెప్టెన్ ఆశిశ్ రెడ్డి 31, వరుణ్ గౌడ్ 31 రన్స్ చేశారు.

హైదరాబాద్ బౌలర్లు సూర్యప్రసాద్, పుష్కర్ చెరో 2 వికెట్లు తీసుకోగా.. శుభమ్ బిస్త్ ఒక వికెట్  పడగొట్టాడు.

Posted in Uncategorized

Latest Updates