TTL మ్యాచ్ : హైదరాబాద్ పై నిజామాబాద్ విక్టరీ

TTL MLRవెంకటస్వామి మెమొరియల్ టీ20 లీగ్ లో హైదరాబాద్ పై నిజామాబాద్ టీం విజయం సాధించింది. సోమవారం (ఫిబ్రవరి-5) గండిమైసమ్మ MLR స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో… టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీపుకుంది శ్రీనిధియన్ హైదరాబాద్ థండర్ బోల్ట్స్. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 రన్స్ చేసింది. డ్యానీ ప్రిన్స్ 81, విట్టల్ అనురాగ్ 73 రన్స్ తో రాణించారు. 179 రన్స్ టార్గెట్ తో బరిలో దిగిన నిజామాబాద్ నైట్స్… 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది. ఓపెనర్ తనయ్ త్యాగరాజన్ 68 రన్స్, ప్రణీత్ రెడ్డి 32 రన్స్ తో రాణించారు.

Posted in Uncategorized

Latest Updates