TTL మ్యాచ్ 2: కాకతీయ కింగ్స్ పై MLR రాయల్స్ విజయం

mlrతెలంగాణ టీ20లో MLR రాయల్స్ మహబూబ్ నగర్ జట్టు బోణీ కొట్టింది. కాకతీయ కింగ్స్ పై 8వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన MLR రాయల్స్… ఫీల్డింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన కాకతీయ కింగ్స్ కు మహబూబ్ నగర్ బౌలర్లు స్టార్టింగ్ లోనే షాక్ ఇచ్చారు. ఓపెనర్ సుకాంత్ ఒక్క పరుగుకే రనౌట్ అయ్యాడు. వన్ డౌన్ బ్యాట్స్ మెన్ యతిన్ రెడ్డి సింగిల్ రన్ కే ఔట్ చేశాడు అజయ్ దేవ్ గౌడ్. సెకండ్ డౌన్ బ్యాట్స్ మెన్ చైతన్య రెడ్డి కూడా 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ యశ్వంత్ రెడ్డి… ప్రగ్నయ్ రెడ్డిలు నిలకడగా ఆడారు. అయితే 14 బంతుల్లో  ఒక సిక్సర్, 3 ఫోర్లతో 23 రన్స్ చేసి యశ్వంత్ ఔట్ అయ్యాడు. ప్రగ్నయ్ రెడ్డి మాత్రం సూపర్ గా ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు. అదే ఊపులో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ప్రగ్నయ్ దూకుడుగా ఆడుతుంటే మిగతా బ్యాట్స్ మెన్ కుదురుకోలేకపోయారు. అజయ్ 11, రోహిత్ 6, ముదస్సర్ 5 పరుగులకు ఔటయ్యారు. 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 67 పరుగులు చేసి ప్రగ్నయ్ పెవిలియన్ చేరాడు. చివర్లో చరణ్ తేజ 8బంతుల్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్ తో 30 పరుగులు చేశాడు. మొత్తంగా 20 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది కాకతీయ కింగ్స్. MLR బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ 3, అనికేత్ రెడ్డి 2 వికెట్లు తీయగా… ప్రణీత్, ఇల్యాన్ శతాని, నీల్ కమల్ తలో వికెట్ పడగొట్టారు.

160 రన్స్ టార్గెట్ తో చేజింగ్ కు దిగిన MLR రాయల్స్ మహబూబ్ నగర్ కు ఓపెనర్లు మంచి స్టార్టింగ్ ఇచ్చారు.  షకీర్ ఖాన్, తిలక్ వర్మ ఫస్ట్ వికెట్ కు 84 పరుగులు చేశారు. 28 రన్స్ చేసి షకీర్ ఖాన్ ఔట్ కాగా… తిలక్ వర్మ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు తిలక్. తర్వాత వచ్చిన నీల్ కమల్, చంద్రశేఖర్ లు దూకుడుగా ఆడుతు టార్గెట్ ఫినిష్ చేశారు. దీంతో 16.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది MLR రాయల్స్. నీల్ కమల్ 21, చంద్రశేఖర్ 46 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

Posted in Uncategorized

Latest Updates