20న జిల్లా కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం

సీఎం కేసీఆర్ ఈ నెల 20న జిల్లా కలెక్టర్లతో  ప్రగతి భవన్ లో భేటీ కానున్నారు . ఉదయం 11.30 గంటలకు మొదలయ్యే ఈ సమావేశానికి మంత్రులు కూడా హాజరు కానున్నారు. కొత్తగా తీసుకురానున్న రెవెన్యూ చట్టంపై కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోనున్నారు. క్షేత్ర స్థాయిలో కలెక్టర్ల అనుభవాలు, సూచనలు తీసుకోనున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు , రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొత్త చట్టం ఉండాలంటే ఎలాంటి నిబంధనలు రూపొందించాలనే అంశంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. కలెక్టర్లు కూడా అభిప్రాయాలు , సూచనలు చెప్పడానికి , చర్చలో భాగస్వామ్యం కావడానికి సిద్దమై రావాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్త మున్సిపల్ చట్టం, కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమలు పై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు . త్వరలో అమలు కానున్న 60 రోజుల యాక్షన్ ప్లాన్ పై కూడా చర్చిస్తారు.

Latest Updates